ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

Dec 20 2025 9:12 AM | Updated on Dec 20 2025 9:12 AM

ట్రాన

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి కోడి పిల్లకు నాలుగు కాళ్లు దరఖాస్తుల ఆహ్వానం నేడు కొత్త కోర్టుల ప్రారంభం కూలీ కొడుకు గ్రూప్‌–3 ర్యాంకర్‌ ధాన్యం పందుల పాలు

ములుగు రూరల్‌: జిల్లాలోని ట్రాన్‌జెండర్లు నేషనల్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తుల రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ట్రాన్స్‌జెండర్‌ ఐడీ కార్డు, సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. నిరుద్యోగులైన ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం తెలంగాణ పునరావాస పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు.

వాజేడు: మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గజ్జల కృష్ణయ్య ఇంట్లో కోడి 11 గుడ్లు పెట్టి పొదిగింది. పది పిల్ల లు రెండు కాళ్లతో జన్మించగా ఒక కోడి పిల్ల మాత్రం నాలుగు కాళ్లతో పుట్టింది. మిగితా వాటికంటే నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల చురుగ్గా ఉందని కృష్ణయ్య తెలిపారు.

ములుగు రూరల్‌: విదేశాల్లో చదువుకునే సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పఽథకం ద్వారా పోస్టు గ్రాడ్యూయేట్‌ విదేశాల్లో చదివేందుకు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అ ధికారి సర్ధార్‌ సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, ములుగు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో నేడు(శనివారం) రెండు నూతన కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌ వర్‌ుచ్యవల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నామవారపు రాజేశ్వర్‌రావు, జస్టిస్‌ బిఆర్‌ మధుసూదన్‌రావు వర్‌ుచ్యవల్‌ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆపరేష్‌కుమార్‌ను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్‌రావు, విష్ణువర్ధన్‌రావు, శివకుమార్‌, రమేష్‌నాయక్‌, రాకేష్‌, వెంకటస్వామి, దివ్య పాల్గొన్నారు.

టేకుమట్ల: గ్రూప్‌ త్రీ ఫలితాల్లో మండలంలోని రామకృష్ణపూర్‌ (టి)గ్రామానికి చెందిన కూలీ కొడుకు బొంపెల్లి బాలకృష్ణ మంచి ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. మండలంలోని రామకృష్ణపూర్‌ (టి) గ్రామానికి చెందిన బొంపెల్లి గొవిందం–విమల దంపతులది రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబం. నిత్యం కూలి పని చేసుకుంటూ కుమారుడు బాలకృష్ణను ఉన్నత చదువులు చదివించారు. బాలకృష్ణ చదువులో కష్టపడుతూ సివిల్స్‌ కోసం సన్నద్ధమయ్యాడు. సివిల్స్‌ రాకపోవడంతో గ్రూప్‌ వన్‌, టూ, త్రీకి సన్నద్ధమయ్యాడు. గ్రూప్‌ త్రీలో 1,061 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు.

మల్హర్‌: తాడిచర్ల పీఏసీఎస్‌ కార్యాలయంలో విక్రయించేందుకు ఆరబోసిన ధాన్యాన్ని పందులు తింటున్నాయి. ఽపనులు వదులుకొని పగలు, రాత్రి కావలి కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు.

ట్రాన్స్‌జెండర్లు పేర్లు  నమోదు చేసుకోవాలి
1
1/3

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

ట్రాన్స్‌జెండర్లు పేర్లు  నమోదు చేసుకోవాలి
2
2/3

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

ట్రాన్స్‌జెండర్లు పేర్లు  నమోదు చేసుకోవాలి
3
3/3

ట్రాన్స్‌జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement