విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు రూరల్: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ స్కూల్‌లో శుక్రవారం 53వ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రతిభకు పేదరికం, గ్రామీణ నేపధ్యం అడ్డుకాదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆధునిక వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథంతో కూడిన వినూత్న ప్రదర్శనలను తీసుకురావాలని సూచించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్‌ఫేర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్ని విధాలుగా సహకరించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, వినోద్ కుమార్, రాజు, శ్యాంసుందర్, రజిత, శ్రీని వాస్‌రెడ్డి, దివాకర, శ్రీనివాస్, మల్లయ్య, రామ య్య, శ్రీనివాస్, మల్లారెడ్డి, సోమారెడ్డి, లక్ష్మీరెడ్డి, వి ద్యాసాగర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


