ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
ములుగు రూరల్:/గోవిందరావుపేట: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా చౌరస్తాలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆ ప్రతులను దహనం చేశారు. దేశంలోని వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని వివరించారు. సంవత్సరానికి 100 రోజుల పనిదినాలు లభిస్తుండగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిథిగా ఉంచాలని కోరారు. అదేవిధంగా వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని తాళ్లపాడ్ సెంటర్‌లో సైతం బిల్లు ప్రతులను సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటరీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకురావడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, గొంది రాజేశ్, అంబాల మురళి, గుండు రామస్వామి, కడారి నాగరాజు, కొట్టే కృష్ణారావు, క్యాతం సూర్యనారయణ, కన్నోజు సదానందం, గుండు లెనిన్, కందుల రాజేశ్వరీ, మంచాల కవిత, పిట్టల అరుణ్, సిరిపల్లి జీవన్, డాక్టర్ ఐలయ్య, మడకం రాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం


