మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సమస్యాత్మక గ్రామాలపై నజర్
ఎస్పీ
సుధీర్ రాంనాథ్ కేకన్
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీపై 24 గంటల పాటు పోలీసుల నిఘా ఉంటుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను, ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తూ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నాం.
ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోపు ఎవరూ సంచరించవద్దు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు గొడవలు పెట్టుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రజల సహకారంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేస్తాం.
జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెడుతున్నాం. పోలింగ్ రూట్లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరే వరకు పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో సుమారు 1300 పోలింగ్ కేంద్రాల పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నాం. ప్రతీ పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక నజర్ ఉంటుంది.
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


