బ్యాలెట్ బాక్సులు సిద్ధం
ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్ ఈ నెల 11న ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో జరగనుండగా ఈ మేరకు అధికారులు సోమవారం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఏటూరునాగారం మండలంలోని 12 జీపీలకు గాను 24,636 ఓట్లు ఉన్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను శుభ్రం చేయించి సిద్ధం చేయించినట్లు తెలిపారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను సైతం అధికారులు నిర్వహించారు. 10వ తేదీన పోలింగ్ బూత్, రూట్ ఆఫీసర్లతో కలిసి ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్‌లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలో 16,680 మంది ఓటర్లు ఉండగా 130 పోలింగ్ కేంద్రాలకు 136 పోలింగ్ బాక్సులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 18 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు 52 మంది సర్పంచులు, 239 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా 15 జీపీలకు 52 మంది బరిలో నిల్వగా 283 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు.
బ్యాలెట్ బాక్సులు సిద్ధం


