మహాజాతరకు అడవిమార్గంలో రోడ్డు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర సందర్భంగా అటవీ మార్గంలోని రోడ్డును అధికారులు చదును చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మండల పరిధిలోని వెంగ్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెపల్లి నుంచి అటవీ మార్గం గుండా మేడారం వీఐపీ పార్కింగ్ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా ద్విచక్ర, ఫోర్‌వీల్ వాహనాలు వెళ్లే విధంగా ప్రస్తుతం రోడ్డును ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వచ్చే వీఐపీల వాహనాలను సైతం ఈ రోడ్డు మార్గం గుండానే మళ్లించేందుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ మార్గన రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ సారి ట్రాఫిక్ సమస్య తీరనుంది.


