శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
వరంగల్‌లో ‘హైదరాబాద్’ అభివృద్ధి
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్‌రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్య
అభివాదం చేస్తున్న సీఎం
రేవంత్‌రెడ్డి
నర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
హెలిపాడ్ వద్ద రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తు
సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభావేదిక వద్దకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయ తీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభాప్రాంగణమంతా నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు.
ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం
కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా
నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


