‘నవోదయ’ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ తెలిపారు. శుక్రవా రం ఆయన తన చాంబర్‌లో జవహర్ నవోదయ వి ద్యాలయ అధికారులు, సంబంధిత అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మా మునూరు జవహర్ నవోదయ విద్యాలయ వరంగల్‌లో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈనెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాల్లో 515 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ లో 162 మంది విద్యార్థులు, బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో 192 మంది విద్యార్థులు, ములుగు జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో 161 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వా రు విద్యాలయ హెల్ప్ లైన్ నంబర్ 91107 82213 కు ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికా రులను ఆదేశించారు. నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఇన్‌చార్జ్ లక్ష్మీరెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ పాల్గొన్నారు.
ములుగులో మూడు పరీక్ష కేంద్రాలు
హాజరు కానున్న 515 మంది విద్యార్థులు
అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్


