మేడారంలో మొక్కుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానా లు అచరించిన భక్తులు అమ్మవార్లకు పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలో గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణం పనులు చేస్తు న్న కార్యికులు, భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
మేడారంలో మొక్కుల సందడి


