
పర్యావరణాన్ని పరిరక్షించాలి
ములుగు రూరల్: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలలో ఏకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ సరిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకో బజార్‌లో 8 స్టాల్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రకృతి సహజసిద్ధంగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణతో పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేషం, కవిత, భాస్కర్, రాధిక, ఉదయశ్రీ, విజేత, జగదీశ్, లేజోలత, శ్రీను, సుమన్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
గెలుపోటములు సహజం
ములుగు: క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని జిల్లా విద్యాశాఖాధికారి సిద్దార్థరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గిరిజనభవన్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి కరాటే పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కరాటే క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ అజ్మీర రాజు నాయక్ మాట్లాడుతూ కరాటేతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 230 మంది క్రీడాకారులు, 45 మంది కోచ్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ములుగు క్రీడల సెక్రటరీ బల్గూరి వేణు, పీఈటీలు యాలం ఆదినారాయణ, శ్రీదేవి, లవనిక, లక్ష్మణ్, జగదీశ్, నాగేందర్, రాజు, రఘు, సుజిత్, ప్రదీప్ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అర్షం రాజు పాల్గొన్నారు.
బోధనేతర పనులతో ఇబ్బందులు
వాజేడు: ఉపాధ్యాయులు బోధనేతర పనులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వివిధ స్థాయిలను బట్టి ఉపాధ్యాయులను కొన్ని టీంలను ఏర్పాటు చేసి తనిఖీలకు పంపడం సరైన విధానం కాదన్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. పర్యవేక్షణ టీమ్‌లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్ష, కార్యదర్శులు వాసం సుదేశ్‌రావు, చిందె రాజేష్, కుమార్‌బాబు తదితరులు ఉన్నారు.
చట్టాలపై అవగాహన
ఉండాలి
ములుగు: న్యాయ చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నవభారతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం అనేది సామాజిక ఆర్థిక సమస్య అని, పేదరికాన్ని నిర్మూలించడానికి విద్యాపరంగా ఎదగాలన్నారు. ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బార్డర్‌లో వాహన తనిఖీలు
కాళేశ్వరం: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలోని బార్డర్ చెక్‌పోస్టు వద్ద కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మూడు రోజుల కిందట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద మావోయిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆశన్నతో రెండువందల మంది వరకు ప్రభుత్వం వద్ద లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి