
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?
● జాతీయ రహదారిపై
నల్లబ్యాడ్జీలతో నిరసన
● ఏపీ ప్రభుత్వంపై మండిపడిన
జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు
ములుగు: ప్రజల గొంతుగా నిలిచి ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా? అంటూ ఏపీ ప్రభుత్వంపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఎండీ.షపీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి, పిట్టల మధుసూదన్, ప్రజా సంఘాల నాయకుడు ముంజాల భిక్షపతి మండిపడ్డారు. సాక్షి దినపత్రికపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పత్రికస్వేచ్ఛను కాపాడాలని నినాదించారు. సాక్షి గొంతుక నొక్కడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తీరును ముక్తకంఠంతో ఖండిస్తున్నామని జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు బేతి సతీష్, గాధం దేవేందర్, బైకాని నటరాజ్, దూడబోయిన రాకేష్, సుంకరి సంపత్, జాలిగపు శ్రీనివాస్, గండ్రకోట విష్ణు, బోయినిపల్లి శ్రీధర్‌రావు, గజ్జి రాజేష్, గట్టు ప్రశాంత్, పోలోజు రామ్మూర్తి, చుంచు రమేశ్, కోట రమేశ్, ధర్మపురి శ్రీనివాస్, రాంబాబు, వెంకట్, మల్లేష్, తిరుమల్‌రెడ్డి, సంజీవ, మహేందర్, కెతే ఆనంద్, రాజు, శంకర్, భాస్కర్, బానోతు వెంకన్న, రఫీ, సంపత్, రామస్వామి, రవిరామన్ తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?