
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా సంక్షేమాధికారి రవి
ములుగు రూరల్: గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా సంక్షేమాధికారి తుల రవి తెలిపారు. ఈ మేరకు గురువారం పోషణమాసం ముగింపు కార్యక్రమంలో భాగంగా మండలంలోని అబ్బాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 16వరకు నెల రోజుల పాటు పోషణమాసం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణులు, కిశోర బాలికల్లో రక్తహీనతపై అవగాహన కల్పించారు. మిటమిన్స్, ప్రొటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం మేలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శిరీష, సూపర్ వైజర్లు సరస్వతి, అనంతలక్ష్మి, నాగేశ్వర్‌రావు, వెంకట్, ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.