
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
● ఎస్సై వెంకటేశ్వరరావు
ములుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో గురువారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలికల కరాటే టోర్నమెంట్ క్రీడా పోటీలకు ఆయన హాజరై మాట్లాడారు. బాలికల ఆత్మరక్షణ కరాటే ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారికి స్పోర్ట్స్ కిట్స్ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ పోటీల్లో 250 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అజ్మీర రాజు, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ బల్గూరి వేణు, పీఈటీలు గుండెబోయిన మల్లయ్య, యాలం ఆదినారాయణ, సురేష్, చంద్రశేఖర్, పాపయ్య, రామస్వామి, హనుమంతరావు, మొగిలి, రవి తదితరులు పాల్గొన్నారు.