విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Oct 17 2025 6:42 AM | Updated on Oct 17 2025 6:42 AM

విదేశ

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి పాముకాటుతో రైతు మృతి ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరవేయాలి దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు

ములుగు రూరల్‌: విదేశాల్లో ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాని జిల్లా ఉపాధి కల్పన అధికారి తుల రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్‌ మాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన వారికోసం విదేశీ నియామక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లమా, డిగ్రీ కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు అనువైనవని వివరించారు. ఆసక్తిగల వారు tomcom, resume@ gmail. comకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెంకటాపురం(ఎం): పాము కాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని లక్ష్మిదేవిపేటకు చెందిన కేతిరి సమ్మయ్య(70) గ్రామ శివారులోని పెద్దమ్మకుంట సమీపంలో గల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకులను భార్య ఓదెక్కతో కలిసి కోస్తున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు సమ్మయ్యను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సమ్మయ్య మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కాటారం: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా చేరవేసి ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుడిపై ఉందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ కిశోర్‌ అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, టిపిసిసి శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్‌ కాంగ్రెస్‌ మంథని నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్‌ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధన్వాడలో నియోజకవర్గ స్థాయి యూత్‌ కాంగ్రెస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాంధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా బండ కిషోర్‌, చీమల సందీప్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో యూత్‌ కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేసి యువతను పార్టీతో కలిపి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. యూత్‌ కాంగ్రెస్‌ గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్‌, పలు మండలాల అధ్యక్షుడు చిటూరి మహేశ్‌గౌడ్‌, గడ్డం క్రాంతి, రెబల్‌ రాజ్‌కుమార్‌, మోత్కూరి అవినాష్‌, సాధుల శ్రీకాంత్‌, వినీత్‌, వంశీనాయక్‌, నగేశ్‌, రాజు పాల్గొన్నారు.

కాజీపేట రూరల్‌: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్‌ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్‌ తెలిపారు. కాజీపేట జంక్షన్‌ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్‌ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్‌ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్‌ 23వ తేదీ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్‌–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో సమస్థిపూర్‌, ముఝఫర్‌పూర్‌, హాజీపూర్‌, సోనాపూర్‌, చాప్రా, గ్రామీణ్‌, సివన్‌, డోరియోసాదర్‌, గోరఖ్‌పూర్‌, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్‌, కాన్‌పూర్‌సెంట్రల్‌, ఓరియా, వీజీఎల్‌ ఝాన్సీ, బీనా, బోఫాల్‌, ఇటార్సీ, జోద్‌పూర్‌, కాబిన్‌, ఆమ్లా, నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్‌, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, దోనే, ధర్మవరం, హిందుపూర్‌, ఎలహంకా స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

విదేశీ ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకోవాలి 
1
1/2

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

విదేశీ ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకోవాలి 
2
2/2

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement