
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ములుగు రూరల్: పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎల్‌ఓలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలన్నారు. బూత్‌స్థాయి అధికారుల నియామకం, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీపై సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పెండింగ్ దరఖాస్తులను వారం రోజులుగా పరిష్కరించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ 2002లో పేరు నమోదు కాకుండా మిస్సైన ఓటర్లు జిల్లాలో ఎంత మంది ఉంటారో పరిశీలించి నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి
సుదర్శన్‌రెడ్డి