
పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
ఏటూరునాగారం: పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్‌కు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఖబ్రస్తాన్‌లకు ప్రహరీలు ఇచ్చామని, ఇందిరమ్మ మొదటి విడుతలో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు 140 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో బిర్యాని అందిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులు అంగన్‌వాడీ బడికి పోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మనోజ్, ఎల్లయ్య, ప్రసాద్, సర్కార్, ఖలీల్, రఘు, రహీమ్, అక్బర్, రజాక్, హరీఫ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క