
అక్రమ కేసులు సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడినందుకు బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయ డం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టుకు 22మంది బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులతో పోలీసులు బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ పార్టీ అణిచివేత దోరణికి భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, కొత్త సురేందర్, రవీంద్రాచారి, జవహర్‌లాల్, నగరపు రమేష్, కృష్ణాకర్, రాకేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.