
సఖితో భరోసా
ములుగు రూరల్: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ సమాజంలో పలు రకాల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, బాల్య వివాహాల నివారణకు తక్షణ సహాయం కోసం ప్రభుత్వం సఖి(వన్‌స్టాప్ సెంటర్) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాలో పలు రకాల వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సఖి కేంద్రం అందించే సేవలపై సిబ్బంది చైతన్య పరుస్తున్నారు.
ఉచిత న్యాయ సహాయం
జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం ఆధ్వర్యంలో 10 మండలాల నుంచి వచ్చే బాధిత మహిళలు, యువతులకు అందించే పోలీస్, న్యాయ సహాయం, వసతి, ఫిర్యాదు విధానాలు, చేకూరే న్యాయంపై సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులకు గురైన మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి కౌన్సెలింగ్‌తో పాటు సమస్యల పరిష్కారానికి పోలీస్, ఉచిత న్యాయ సహాయం అందించి బాధిత మహిళలకు అండగా ఉంటున్నారు.
ఐదు రోజుల పాటు రక్షణ
బాధిత మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే సఖి కేంద్రం సిబ్బంది వారికి ఐదు రోజుల పాటు భోజనం, వసతితో పాటు వైద్యం, పోలీస్, ఉచిత న్యాయం, ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి స్థాయి రక్షణ కూడా కల్పిస్తారు. బాధితులు రక్షణాధికారికి, జిల్లా సంక్షేమాధికారికి, పోలీస్‌స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, ఆడపిల్లల అమ్మకం వంటి వాటిపై హెల్ప్‌లైన్ నంబర్ 181ను ఆశ్రయించవచ్చు.
సఖి కేంద్రం ఆధ్వర్యంలో..
ఈ ఐదేళ్ల కాలంలో సఖి కేంద్రం సిబ్బంది ఇప్పటి వరకు సోషల్ కౌన్సెలింగ్ 1,426 మందికి ఇచ్చారు. అలాగే లీగల్ కౌన్సెలింగ్ 846 మందికి ఇవ్వగా వైద్య సదుపాయం 922 మందికి కల్పించారు. పోలీస్ సపోర్టు 148, వసతి పొందిన వారు 497 మంది మహిళలు ఉన్నారు. అలాగే పిల్లల సంరక్షణ 225 మందికి కల్పించగా, పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు 895 మందికి కల్పించారు. సదరం హోంకు 21 మందిని తరలించి సేవలు అందించారు.
ఆపదలో అండగా ఉంటాం..
మహిళలకు, బాలికలకు ఆపద సమయంలో సఖీ కేంద్రం అండగా నిలుస్తోంది. సహాయం కోరిన మహిళలకు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. బాధిత మహిళలకు వైద్యం, పోలీస్, ఉచిత న్యాయం, భోజనం అందించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తాం. ఆపద సమయంలో 181 హెల్ప్‌లైన్ నంబర్ లేదా 08715 2951281, 7013745008లలో సంప్రదించాలి.
జిల్లాలో 2020– 25వరకు నమోదైన కేసుల వివరాలు
బాధిత మహిళలకు అండగా
వన్‌స్టాప్ సెంటర్
వసతి, రక్షణ కల్పిస్తూ న్యాయం చేస్తున్న సిబ్బంది
గ్రామాల్లో పలు చైతన్య కార్యక్రమాలు
కేసు అందిన పరిష్కరించినవి పెండింగ్‌లో
ఫిర్యాదులు ఉన్నవి
గృహహింస 615 529 86
వరకట్నం 8 8 0
బాలికలపై లైంగిక దాడులు 44 39 5
బాల్య వివాహాలు 39 36 3
మిస్సింగ్ 43 42 1
చీటింగ్ 35 34 1
ప్రేమించి మోసం 63 61 2
మహిళలపై లైంగిక దాడులు 1 1 0
సీనియర్ సిటిజన్ 2 2 0
ఆస్తి తగాదాలు 15 15 0
ఇతర కేసులు 40 37 3

సఖితో భరోసా