
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
● బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి
ములుగు/ములుగు రూరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మోసపూరిత గ్యారంటీలను వివరిస్తూ ఎండగట్టాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్న అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకవెళ్లడానికి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీకార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతీ కార్యకర్త బాకీ కార్డును ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పోరిక గోవింద్‌నాయక్, సకినాల భవాని, అజ్మీర ధరంసింగ్, చెన్న విజయ్, కోగిల మహేష్, పోరిక విజయ్‌రాంనాయక్, దేవరనేని స్వామిరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మల్లంపల్లి మండల కేంద్రంతో పాటు ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన కారకర్తల సమావేశాలకు నాగజ్యోతి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ బాకీకార్డులను విడుదల చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని నాగజ్యోతి సూచించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పాలెపు శ్రీనివాస్, పోరిక గోవింద్‌నాయక్, విజయరాంనాయక్, మహేష్, జంపన్న, విష్ణువర్ధన్, రాములు, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, మేడారం జాతర మాజీ చైర్మన్ రేగా నర్సయ్య, మాజీ ఎంపీటీసీలు ముండ్రాతి రాజమౌళి, దానక నర్సింగరావు, మాజీ సర్పంచులు ఊకే మోహన్ రావు, నాగేశ్వరరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.