
రూ.50 కోట్లతో పట్టణాభివృద్ధి
ములుగు: ములుగు పట్టణాభివృద్ధికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను విడుదల చేసిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసినట్లు వెల్లడించారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క నిత్యం కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ములుగు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.150 కోట్లతో మేడారం పనులు, ములుగు ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతనిప్పుల భిక్షపతి, వంగ రవియాదవ్‌తో పలువురు నాయకులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్