ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

Aug 4 2025 4:20 AM | Updated on Aug 4 2025 4:36 AM

ముగిస

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

కన్నాయిగూడెం: మావోయిస్టుల వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. దీంతో ఆదివారం చివరి రోజు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎస్సై వెంకటేశ్‌ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రకు వెళ్లి వచ్చే రహదారులపై ప్రత్యేక నిఘా వేసి ఉంచారు. వచ్చి పోయే వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ముత్యాలమ్మతల్లికి మొక్కులు

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పెరిక వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ఆదివారం కావటంతో గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి తెల్లావారుజామునే భక్తిశ్రద్ధలతో బోనం వండుకుని ఆలయానికి తీసుకెళ్లి మొక్కును చెల్లించుకున్నారు. పాడిపంట బాగా పండాలని, పిల్లాపాపలతో సల్లంగా ఉండాలని కోరుకుని మొక్కులను చెల్లించుకున్నారు.

యాదవ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమేష్‌

వాజేడు: యాదవ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన నల్లగాసి రమేష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాకుల నాగభూషయ్య ఆదివారం రమేష్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్ల డించారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు.

కళాశాలకు భవనం మంజూరు చేయాలి

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు భవనం మంజూరు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని చొక్కాల గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయని మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కోరారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలు, హర్ష, అభిలాష్‌, హేమంతి, నిరంజన్‌, రామ్‌, చరణ్‌, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు.

రాజబాబు గౌడ్‌కు సన్మానం

కాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజబాబు గౌడ్‌ను వారి స్వగహంలో కాళేశ్వరం గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. సామాజిక వర్గానికి చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు పొన్నం లింగయ్య గౌడ్‌, గంట వెంకటస్వామి గౌడ్‌, బైరి రాజబాబు గౌడ్‌, దూది వెంకటస్వామి గౌడ్‌, సదాశివ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
1
1/4

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
2
2/4

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
3
3/4

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
4
4/4

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement