
నానోతో మేలు
ములుగు రూరల్: నత్రజని ఎరువులు వినియోగంతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగానికి బదులుగా ద్రవరూపంలో నానో యూరియాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నానో యూరియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం యూరియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గుళికల యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియాకు బదులు నానో యూరియాతో పంటలకు, భూసారానికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు.
సాగు ఖర్చులు ఆదా
పంటల సాగులో నానో యూరియా వినియోగంతో పంట సాగు ఖర్చు తగ్గుతుంది. నానో యూరియా 500 మిల్లీ లీటర్ల ద్రావణం ఒక గుళిక యూరియా బస్తా 45 కేజీలకు సమానంగా పని చేస్తుంది. నానో యూరియా 500 మిల్లీ లీటర్లు రూ. 225, గుళికల యూరియా బస్తా రూ. 278కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం యూరియా కొరత కారణంగా యూరియా బస్తా రూ. 300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. నానో యూరియా వినియోగంతో పంటలలో పచ్చదనం, చురుకుగా పెరుగుదల ఉంటుంది. గుళికల యూరియాను రైతులు పంట సాగుకు రెండు నుంచి మూడు సార్లు వినియోగిస్తున్నారు. ఇందులో నత్రజని 30 నుంచి 50 శాతం మాత్రమే పంట వినియోగించుకుంటుంది. మిగతా ఎరువు వృథా అవుతుంది. దీంతో నేల, గాలి, నీరు కలుషితం చేస్తుంది. నానో యూరియా మాత్రం కేవలం పైరుకు మాత్రమే ఉపయోగపడుతుంది.
పంటకు బహుళ ప్రయోజనం
నానో యూరియాతో పంటలకు 80శాతం మేరకు ప్రజయోజనం కలుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మొక్కలకు అవసరమయ్యే నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తూ ఆ కుల్లో కిరణజన్య సంయోగక్రియ పెంచుతుంది. సాంప్రదాయ యూరియా వినియోగంతో పోలిస్తే 50శాతం, అంతకంటే తక్కువ అవసరమవుతుంది ని దీంతో రైతులకు ఖర్చులు తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. నానో యూరియాను లీటర్ నీ టికి 2 నుంచి 4 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పంటలకు పిచికారీ చేయాలి. 20 నుంచి 25 రోజుల వ్య వధికి ఒకసారి వినియోగించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు అంచనా(ఎకరాల్లో)
వరి 1,30,117
పత్తి 27,143
మొక్కజొన్న 6,009
జనుము 1,000
జీలుగ 14,000
యూరియా అవసరం 24,225.12
మెట్రిక్ టన్నులు
పంటలకు ఉపయోగంగా ద్రవరూప యూరియా ఎరువులు
నత్రజని ఎరువుల వాడకంతో
భూసారానికి ముప్పు
రైతులకు అవగాహన కల్పిస్తున్న
వ్యవసాయశాఖ
పర్యావరణ పరిరక్షణకు హితం
పంటల సాగులో నానో యూరియా వినియోగం పర్యావరణ పరిరక్షణకు హితం. గుళికల యూరియా తయారీకి చైనా నుంచి న్యాప్టా ముడిసరుకు దిగుమతి భారంగా మారుతుంది. యూరియా బస్తాపై రైతులకు ప్రభుత్వం రూ.2వేల వరకు రాయితీ ఇస్తుంది. నానో యూరియాతో వాతావరణం కలుషితం కాదు. భూమి స్వభావం దెబ్బతినదు, గుళికల యూరియా వినియోగంతో భూమిలో సూక్షజీవులు చనిపోతాయి, భూ సారంలో కార్బన్‌శాతం తగ్గిపోతుంది. యూరియా భూమిలో కలిసి రైతులు కేన్సర్ బారిన పడుతున్నారు. నానో యూరియా పంటలపై పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– సురేష్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

నానోతో మేలు

నానోతో మేలు