
కార్మికుల పక్షాన సీఐటీయూ పోరాటం
● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
వాజేడు: కార్మికుల పక్షాన నిరంతరం పోరాడేది సీఐటీయూ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో సోమవారం గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతుందన్నారు. పలుమార్లు సమ్మె చేసినా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనా సమయంలో 29 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటల తగ్గింపు, బీమా సౌకర్యం, పని కల్పిస్తామని అధికారంలోకి రాక ముందు ప్రకటించిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి వచ్చాకా పట్టించుకోవడం లేదన్నారు. మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో పచాయతీ కార్మికులను తీసుకుని 12గంటలు పనిచేయిస్తుందన్నారు. పలు సమస్యలపై సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని 60 మంది గ్రామ పంచాయతీ కార్మికులు సీఐటీయూలో చేరారు.