మంగపేట: నేడు మండల కేంద్రంతో పాటు రాజుపేటలో మంత్రి సీతక్క మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి సీతక్క పంపిణీ చేయనున్నారు. నాబార్డు, డీసీసీబీ వారి సహకారంతో మల్టీసర్వీస్ కో ఆపరేటీవ్స్(ఎంఎస్‌సీ) స్కీం ద్వారా మండల కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌సీఎస్ కార్యాలయ ఆవరణలో రూ.76 లక్షల నిధులతో నిర్మించిన గోదాంను ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజుపేటలో రూ.59 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని 4.15 గంటలకు ప్రారంభించనున్నారు.
అతిథి అధ్యాపకుల భర్తీకి
దరఖాస్తులు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో 2025–26 గాను వృక్షశాస్త్రం 1, రసాయనశాస్త్రం 1, జంతుశాస్త్రం 1, కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2, అర్ధశాస్త్రం 1, రాజనీతిశాస్త్రం 1 బోధించడానికి గాను అతిథి అధ్యాపకుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ, డిగ్రీ జనరల్ ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్న వారు పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో రేపు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సమర్పించాలని ఆమె కోరారు. డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తామని వివరించారు.
ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి బాబురావు సోమవారం జిల్లాకేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఎరువుల స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాపులకు వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా పురుగుమందులు, నానో యూరియాతో లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అర్చకుడికి
ముఖ్య అర్చక ప్రమోషన్?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వ రం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అ ర్చకుడికి ముఖ్య అర్చక ప్రమోషన్ ఉత్తర్వులు సోమవారం వచ్చినట్లు సమాచారం. ప్రమోషన్ ఉత్తర్వులపైన దేవాదాయశాఖ అధికారులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొక్కలు నాటిన పోలీసులు
పలిమెల: వన మహోత్సవంలో భాగంగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ రాంచందర్‌రావు, పలిమెల ఎస్సై జె.రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పలిమెల పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్సై వినోద్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.
ఏఐతో విద్యాబోధన
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలోని ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ కన్నన్ మౌధాల్యా, ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ సమీర్ సహస్ర బుదే, నిట్ టీటీఆర్ చైన్నె ప్రొఫెసర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి సీతక్క పర్యటన