
పెరుగుతున్న గోదావరి ఉధృతి
వాజేడు మండలం పేరూరు వద్ద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో వాజేడు మండలంలో గోదావరి ఉప్పొంగుతోంది. పలు చోట్ల రహదారులు ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై పలు చోట్ల వంతెనలు మూసివేశారు. ప్రజలెవ్వరూ నీటిలోకి వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లను అడ్డుపెట్టారు.
– మరిన్ని వార్తలు 8లోu