
కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం
గోవిందరావుపేట: కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం అని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండల పరిధి పస్రాలో జక్కు రాజుగౌడ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో కల్తీ కల్లు మరణాల దృష్ట్యా జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజసమ్మయ్య కల్లు శాంపిల్ తీసుకున్నారు. ఈసందర్భంగా బుర్ర శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధ కల్లులో అనేక పోషకాలున్నాయని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రకృతి సిద్ధమైన కల్లు సేవించాలని ప్రచారం చేయాలని, శీతల పానీయాలు తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పస్రా సొసైటీ కల్లు గీత కార్మికులు జక్కు మొగిళిగౌడ్, మేర్గు సుధాకర్‌గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, జక్కు భిక్షపతిగౌడ్, దామోదర్ గౌడ్, ఎకై ్సజ్ సిబ్బంది హెడ్ కానిస్టెబుల్ శ్రీకాంత్, సునీల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
కల్లు గీత కార్మిక సంఘం
జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్