
లేబర్ కోడ్‌లు రద్దుచేయాలి
మలుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. 8 గంటల పని విధానానికి బదులు 10 గంటల పని విధానాన్ని నిర్ణయించే జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, ఐల్లయ్య, కృష్ణ, నారాయణ సింగ్, రవి, ప్రవీణ్, మహేష్, నీలాదేవి, మంజూల, సరిత, సరోజీని పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా