
వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా స్వర్ణకుమారి
ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా స్వర్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్‌లను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మెడికల్ కళాశాల చర్మవ్యాధి విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ మోహన్‌లాల్‌ను డిప్యుటేషన్‌పై జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎంలో చర్మ వ్యాధి విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్వర్ణకుమారిని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పించి నియమించారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్‌కు పదోన్నతి కల్పించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు.
వరదల సమయంలో
అప్రమత్తం
ములుగు రూరల్: వరదల సమయంలో ముంపు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. మండల పరిధిలోని రాయినిగూడెం వైద్యశాలలో వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని గర్భిణులు వర్షాకాలం వరదల సమయంలో ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ యాక్షన్ టీం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చినప్పుడు తక్షణమే గ్రామాలను సందర్శించి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. నీటి నిల్వలపై దృష్టి సారించి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు అన్వేష్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్ కుమార్, శ్రీకాంత్, రణధీర్, సంపత్, సురేష్ పాల్గొన్నారు.
గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్: గీత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్రి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా, తాడి కార్పొరేషన్ చెక్కులు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ సంబంధం లేకుండా గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని సూచించారు. ఏజెన్సీలో రద్దు చేసిన గీత కార్మిక సొసైటీలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 14న నిర్వహించనున్న నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు.
మహిళలు
ఆర్థికంగా ఎదగాలి
ఏటూరునాగారం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని సెర్ప్ జిల్లా ఏపీడీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమాన్ని డీఆర్‌డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించే దిశగా అవగాహన కల్పించామన్నారు. గ్రూపులో లేని సభ్యులను సంఘాలలో చేర్పించాలని సూచించారు. వృద్ధులు, కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేసి గతేడాది, ఈ ఏడాది సాధించిన ఆర్థిక ప్రగతి, లక్ష్యాలపై సభ్యులకు, సిబ్బందికి వివరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎం సతీష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు, వీఏఓలు పాల్గొన్నారు.

వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా స్వర్ణకుమారి

వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా స్వర్ణకుమారి

వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా స్వర్ణకుమారి