
అభివృద్ధిని చూసి తట్టుకోలేక అవాక్కులు
ములుగు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాధితులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో జరుగతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బరదచల్లె ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్‌కు రెండు గదుల రేకుల షెడ్ ఉందని అందుకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎంపిక కాలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆస్పత్రుల్లో ఫొటోలకు పోజులు బీఆర్‌ఎస్ నాయకులు రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ తన మిడతల దండుతో నియోజకవర్గంలో డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. 70 ఏళ్ల చరిత్రలో గిరిజన మహిళకు సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు మంత్రి వదవి ఇచ్చారని పదవి దక్కితే ఓర్చుకోలేక అస్యతపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో దందాలు, ఇసుక, ఎర్రమట్టిక్వారీలు, దోపిడీకి పాల్పడుతున్నారని తదితర వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు 60 వేల దరఖాస్తులు వస్తే అరుమలైన 20 వేల మందిని ఎంపిక చేశామని అందులో మొదటి విడతలో 5 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను విడుతల వారిగా కేటాయిస్తామని అన్నారు.
అమాయక ప్రజలను
ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు
మంత్రి సీతక్క