
ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తిచేయాలి
ములుగు రూరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అసరమైన డాక్యుమెంట్లు, అననుమతులు, మౌలిక వసతుల కల్పన, కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టికల్చర్ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వివరించారు. పంట మార్పిడి ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ, దిశా ఫౌండేషన్, ఈఎల్‌ఎఫ్‌వారి సౌజన్యంతో జిల్లాలో విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు, స్టోర్ గదిని పరిశీలన చేశారు.
వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు స్థల పరిశీలన
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజల అవసరాల నిమిత్తం వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని బూటారం గ్రామంలోని ముంపు బాధితులకు ఇళ్ల స్థలాల కోసం ఎక్కెల సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్‌జీతో కలిసి మంగళవారం పరిశీలించారు. అలాగే ఏటూరునాగారంలోని అటవీశాఖ నర్సరీ ఉన్న ప్రాంతంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి చిన్నబోయినపల్లిలోని సర్వే నంబర్ 98 అటవీ శాఖలోని భూమి సాగుదారులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వడం వీలు కాదన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర