
లారీ డ్రైవర్ల రాస్తారోకో
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం ఇసుక క్వారీ వద్ద ఆదివారం లారీ డ్రైవర్లు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీసి ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇసుకు నింపడం లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పేరూరు పోలీసులు అక్కడికి వెళ్లి లారీ డ్రైవర్ల నుంచి వివరాలను సేకరించారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీశామని ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇంత వరకు లారీల్లో లోడు చేయడం లేదని తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని అడగడంతో పోలీసులు టీఎస్‌ఎండీసీ అధికారులకు విషయాన్ని వివరించారు. స్పందించిన అధికారులు వెంటనే ఆ లారీలను మంగపేట మండలంలోని మల్లూరు క్వారీకి పంపించడంతో రాస్తారోకో విరమించారు.