
శ్యామాప్రసాద్ ముఖర్జీ సేవలు ఆదర్శం
ఏటూరునాగారం: శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు ఆదర్శమని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్ తెలిపారు. మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్యామాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు వీధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహాయంతో ఆయన 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నె సంపత్, ఈక మహాలక్ష్మీ, గాడిచర్ల రాజశేఖర్, పలక గంగా, పెయ్యల రాకేష్, ఎర్రల్ల ఎల్లయ్య, పడిదల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జనార్దన్