
వన మహోత్సవానికి వేళాయె
గవర్నర్ దత్తత గ్రామంలో సంబురాలు
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తిలో గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు.
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
వెంకటాపురం(ఎం): పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. గతంలో హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టగా ప్రస్తుతం వన మహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వర్షాల ఆధారంగా జూలై మొదటి వారం లేదా రెండోవారంలో మొక్కలు నాటేందుకు డీఆర్‌డీఏతో పాటు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. మొక్కలు నాటేందుకు ఈనెలఖారులోగా గుంతలు తీసే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతీ నర్సరీలో సుమారు 6 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, ఉద్యానవన, నీటిపారుదల, విద్య, వైద్యం, విద్యుత్, పశు సంవర్థక, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలను జూలై మాసంలో నాటేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే మొక్కలు నాటేందుకోసం గుంతలను తీయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పూలు, పండ్ల మొక్కలతో పాటు రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. నర్సరీల్లో గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఊసిరి, అల్లనేరేడు, మునగ, తులసీ, దానిమ్మ, బొప్పాయి, ఈత, అడవి తంగేడు, వేప, గుల్‌మోహర్, కానుగ మొక్కలతో పాటు ఇతర ఔషధ మొక్కలను పెంచుతున్నారు.
న్యూస్‌రీల్
జూలైలో మొక్కలు నాటేలా కార్యాచరణ
ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యం కేటాయింపు
నర్సరీల్లో పూలు, పండ్లు, ఔషధ
మొక్కలు సిద్ధం
జిల్లాలోని 174 జీపీల పరిధిలో
14.16లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం

వన మహోత్సవానికి వేళాయె