కొనసాగుతున్న తాత్కాలిక బస్టాండ్ పనులు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4.80కోట్ల నిధులను కేటాయించింది. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇప్పటికే తరలించారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరలో దేవాదాయశాఖకు సంబంధించిన స్థలంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. బస్సులు నిలపడంతో పాటు ప్రయాణికులు వేచి ఉండేందుకు రేకుల షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే జిల్లాకేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రజా సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం
వాజేడు: ప్రజలకు సుపరిపాలన, సంక్షేమ పథకాలను అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ అన్నారు. మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనపై ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తూ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశ ప్రతిష్ట పెరిగిందని వివరించారు. నాయకులు పార్టీని బూత్ లెవల్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది జగపతి, జిల్లా కౌన్సిలర్ మెంబర్ సీతారామ రాజు, కందుల రాంకిశోర్, ఆత్మకూరి ప్రవీణ్, ఆంజనేయులు, సుబ్బయ్య, కృష్ణకుమారి పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
నాలుగు గేదెలు మృతి
గోవిందరావుపేట: విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని రాఘవపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాఘవపట్నం గ్రామానికి చెందిన గాదె మురళి, పెద్దపుండ్ర మధు, కొడాలి ప్రసాద్, ఎండి అజాంకి చెందిన నాలుగు గేదెలు రోజు మాదిరిగా శనివారం సాయంత్రం మేత మేస్తుండగా అదే సమయంలో వీచిన బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడ్డాయి. ఈ క్రమంలో విద్యుత్ తీగలకు గేదెలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ రూ.2.50లక్షలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.
ఘనంగా స్వామి వారి జయంతి
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం, స్వామి వారికి అభిషేకం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు.
ముగ్గురికి గాయాలు
కాళేశ్వరం: బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన మహదేవపూర్ మండలపరిధిలోని కొత్త బ్రాహ్మణపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సూరారం గ్రామానికి చెందిన చెన్నూరి కార్తీక్ ఆజంనగర్‌కు చెందిన తన స్నేహితులు కిరణ్, మహేష్‌లతో కలిసి ద్విచక్ర వాహనంపై సూరారం నుంచి మహదేవపూర్‌కు వస్తున్నారు. కొత్త బ్రాహ్మణపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బైక్‌పై వెచ్తిన్న చెన్నూరి కార్తీక్ చెవు, ముక్కు భాగంలో తీవ్ర గాయాలు, కిరణ్, మహేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు.
కొనసాగుతున్న తాత్కాలిక బస్టాండ్ పనులు
కొనసాగుతున్న తాత్కాలిక బస్టాండ్ పనులు


