కిటకిటలాడిన హేమాచల క్షేత్రం
ప్రత్యేక అలంకరణలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామి, దర్శించుకుంటున్న భక్తులు
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆదివారం కిటకిటలాడింది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు ఆటోలలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులకు సెలవు రోజు కావడంతో జిల్లాలోని రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని భక్తులు ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు.
కిటకిటలాడిన హేమాచల క్షేత్రం


