రాజీమార్గమే రాజమార్గం
ములుగు రూరల్: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకొని కక్షిదారులు తమ కేసులను రాజీకుదుర్చుకొని ప్రశాంత జీవితం గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌లో నాలుగు బెంచీలు ఏర్పాటు చేసి.. 413 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఎంవీఓపీ కేసులు 13 కాంపిన్సేషన్ రూ.66,39, ఆధార్ కేసులు 164 పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధులిక, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌చారి, రంగోజు భిక్షపతి, నర్సిరెడ్డి, సారంగపాణి, మేకల మహేందర్, సునిల్‌కుమార్, సుధాకర్, స్వామిదాస్, రాజేందర్, అశోక్, సూర్యం, దిలీప్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
ములుగు రూరల్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఆదివారం మండలంలోని జాకారంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మధులిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్‌చారి, బానోత్ స్వామిదాస్, న్యాయవాదులు సునిల్‌కుమార్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ
జాతీయ లోక్‌అదాలత్‌లో 413 కేసులు పరిష్కారం
రాజీమార్గమే రాజమార్గం


