జాతర పనులు పరిశీలించిన ఎస్పీ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదివారం పరిశీలించారు. గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ కల్యాణ మండపం పక్కన నుంచి నిర్మిస్తున్న క్యూలైన్ పనులను పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ ఉన్నారు.
నేడు యథావిధిగా ప్రజావాణి
ములుగు రూరల్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నేటినుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
24న గట్టమ్మ దేవాలయం వద్ద వేలం
మలుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా గట్టమ్మ దేవాలయంలో కొబ్బరికాయలు, కుంకుమ పసుపు విక్రయించుకునే షాపులకు ఈ నెల 24న వేలం పాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వేలం పాటలు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.
రామాలయంలో పారాయణం
కాళేశ్వరం: ధనుర్మాసం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురం చొప్పున పారాయణం పఠిస్తున్నారు. ఆదివారం శ్రీసీత సమేత రామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
24న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పసుల లక్ష్మణ్, పక్కల రాజబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్హర్ మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్సాహమున్న మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 85 కేజీలోపు బరువు ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్‌కార్డుతో పాటు కబడ్డీ కిట్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఈ నెల 26నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 86393 46695, 90106 77080 ఫోన్‌నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఫిట్ ఇండియా కార్యక్రమం
భూపాలపల్లి అర్బన్: జిల్లా యువజన సర్వీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నిర్వహించినట్లు డీవైఎస్‌ఓ చిర్ర రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సండేస్ ఆన్ బైస్కిల్ అనే కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రఘు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది శివసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతర పనులు పరిశీలించిన ఎస్పీ
జాతర పనులు పరిశీలించిన ఎస్పీ


