జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన నిఖిల్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్‌లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్ 18 పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున నిఖిల్ అత్యంత ప్రతిభ కనబర్చాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురుకులం విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఖోఖో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అద్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కుమార్, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


