సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

May 20 2025 1:10 AM | Updated on May 20 2025 1:10 AM

సమస్య

సమస్యలు పరిష్కరించండి

ములుగు : మా బాధలు వినండి.. సమస్యలు పరిష్కరించండంటూ జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు ప్రజావాణిలో విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో భాగంగా 37 దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు అందించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వినతుల విషయంలో అలసత్వం వద్దని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా భూ సమస్యలు పరిష్కరించాలని 10, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తొమ్మిది, పెన్షన్‌ కోసం ఇద్దరు, ఉద్యోగావకాశం కల్పించాలని ఒకరు, ఇతర సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, సివిల్‌ సప్లయ్‌ జిల్లా అధికారి ఫైజల్‌ హుస్సేన్‌, జిల్లా మేనేజర్‌ రాంపతి, డీఎస్‌సీఓ లక్ష్మణ్‌నాయక్‌, డీసీఓ సర్దార్‌సింగ్‌, డీడబ్ల్యూఓ శిరీష, డీపీఓ దేవరాజ్‌, విద్యుత్‌ డీఈ నాగేశ్వర్‌రావు, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ జయప్రకాశ్‌ ఉన్నారు.

గిరిజన దర్బార్‌కు 12 వినతులు

అర్జీలు స్వీకరించిన పీఓ చిత్రామిశ్రా

ఏటూరునాగారం : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరి ష్కరించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సెక్టార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి 12 వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలంలోని సూరవీడులో ఎదిర ఏరియా ఆస్పత్రిలో స్వీపర్‌ పోస్టు ఇప్పించాలని గిరిజన మహిళ కోరారు. ఏటూరునాగారం మండలం శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులను ఐటీడీఏ ద్వారా జీసీసీ నుంచి ఇప్పించాలని నిర్వాహకులు విన్నవించారు. ఐటీడీఏ ఎదుట ఉన్న రెండు షట్టర్లలో హోటల్‌ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన పలువురు జ్యూట్‌ బ్యాగ్‌ మిషన్స్‌, రా మెటీరియల్‌ సెంటర్‌ ఏర్పాటుకు గది ఇప్పించాలని మహిళలు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను కోరారు. గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డకు చెందిన ఓ గిరిజన మహిళా జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో పీఈటీ ఉద్యోగం ఇప్పించాలి విన్నవించారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి పీఎంహెచ్‌బీ ఆఫీస్‌ సబార్డినేట్‌ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని బాధితుడు కోరారు. కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్‌, డీడీ పోచం, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

ఆశ్రమ పాఠశాల్లోని ఎస్టీ హాస్టళ్ల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాగటి రవితేజ, రవి కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఏడు నెలల నుంచి హాస్టళ్ల బిల్లులు విడుదల కాకపోవడంతో వార్డెన్లు అప్పులు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు బిల్లులు క్లియర్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలేశ్వర్‌, నర్సింగరావు పాల్గొన్నారు.

– రవితేజ, రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

నా కొడుకును ఆదుకోండి

నా కుమారుడు బొజ్జ మహేశ్‌ ఎనిమిది నెలలుగా అంతుచిక్కని చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటికే అనేక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించాం. అయినా నయం కావడం లేదు. ఆర్థిక స్థోమత లేక ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా డు. మెరుగైన వైద్యం కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, వైద్య విభాగం తరఫున ఆర్థికంగా ఆదుకోవాలి. నా కుమారుడిని కాపాడుకోవడానికి సహకరించాలి.

– బొజ్జ సుగుణ, గోవిందరావుపేట

కొడుకు,కోడలి నుంచి

రక్షణ కల్పించండి

నా పెద్ద కుమారుడు వల్స మధు, కోడలు సంధ్య నుంచి మాకు ప్రాణహాని ఉంది. వారి నుంచి రక్షణ కల్పించండి. నాకు ఇద్దరు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడికి ఎకరం 20 గుంటల భూమిని, ఇంటిని పంపకాలు చేశాను. తాళ్లగడ్డలోని రెండు గుంటల ఖాళీ స్థలాన్ని పెద్ద కుమారుడికి ఇచ్చాను. అయినా సరిపోనట్టు చిన్న కుమారుడి రెండు గదులను ఆక్రమించుకొని తాళం వేసుకున్నాడు. ఏంటని అడిగితే తీవ్ర పదజాలంతో తిడుతూ మెడపట్టి మమ్ములను బయటికి గెంటేశాడు. ఈ విషయంపై విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కోరారు.

– వల్స సడాలయ్య, ఏటూరునాగారం

ఎస్సీ కార్పొరేషన్‌

రుణం ఇప్పించండి

నాకు ముగ్గురు ఆడపిల్లలు. దంపతులిద్దరం కూలీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రస్తుత కుటుంబ పోషణ భారంగా మారింది. పట్టణాలకు వెళ్లి ఉద్యోగం చూసుకుందామంటే పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సిమెంట్‌ బ్రిక్స్‌ యూనిట్‌ మంజూరు చేయిస్తే కుటుంబాన్ని కాపాడుకుంటాం.

– సంగి శిరీష, గోవిందరావుపేట

నష్ట పరిహారం ఇప్పించండి

వాజేడు : బాండ్‌ వరి సాగు చేయగా దిగుబడి తగ్గి నష్టాలు వచ్చాయని తమకు పరిహారం ఇప్పించాలని కోరుతూ మండల పరిధిలోని పూసూరు రైతులు కలెక్టర్‌ కార్యాయంలో ఫిర్యాదు చేశారు. మంగపేట మండలానికి చెందిన వేణు తమ గ్రామంలో 82 ఎకరాల బాండ్‌ వరి సాగు చేయించాడని తెలిపారు. ఎకరానికి రూ.42వేల పెట్టుబడి ఇచ్చి, 8 క్వింటాల దిగుబడి వస్తుందని నమ్మించినట్లు వివరించారు. దిగుబడి తగ్గితే రూ.60 వేలు నష్ట పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఎకరాకు కేవలం 2 క్వింటాల దిగుబడి మాత్రమే వచ్చిందని, పరిహారం ఇవ్వాలని ఫోన్‌ చేస్తే ఎటువంటి సమాచారం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఎంపీడీఓ విజయ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. రైతులు పూనెం ప్రసాద్‌, బడే షణ్ముక రావు, నల్లెబోయిన పాపారావు, వాసం పెంటయ్య, బడే చిన్నన్న తదితరులు ఉన్నారు. – కలెక్టర్‌లో ఫిర్యాదు చేస్తున్న వాజేడు రైతులు

అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు

ప్రజావాణిలో 37 దరఖాస్తులు

సమస్యలు పరిష్కరించండి1
1/5

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి2
2/5

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి3
3/5

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి4
4/5

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి5
5/5

సమస్యలు పరిష్కరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement