
హేమాచలానికి పుష్కర భక్తుల తాకిడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రానికి సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సందర్శనతో రెండ్రోజుల నుంచి భక్తుల తాకిడి అధికమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వచ్చి, వెళ్లే భక్తులు హేమాచల క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. సోమవారం మూడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు శేఖర్ శర్మ, పవన్‌కుమార్, రాజీవ్ నాగఫణి శర్మ ఈశ్వర్ చంద్ భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

హేమాచలానికి పుష్కర భక్తుల తాకిడి