
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై వినతులు విన్నవించాం.. పరిష్కరించండి అంటూ ప్రజలు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 45 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి స్వీకరించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 12 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా 57 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు వినతులు సిఫారసు చేశారు. క్షుణ్ణంగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
భూసమస్యలు 16
ఇందిరమ్మ ఇళ్లు 14
పింఛన్లు 02
ఇతర సమస్యలు 13
దరఖాస్తుల వివరాలు..
ప్రజావాణిలో 45, గిరిజన దర్బార్‌లో 12 ఫిర్యాదులు
ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ
చిత్రామిశ్రా
క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు