
ఐటీడీఏలో వచ్చిన వినతులు ఇలా..
తాడ్వాయి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నీలమ్మ సీఆర్‌టీ ఉద్యోగం ఇప్పించాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు. ములుగు మండల పరిధిలోని రాయినిగూడెంలో వ్యవసాయ భూములకు పంటల సాగుకోసం 10 హెచ్‌పీ మోటర్లు, పైపులు ఇప్పించాలని గిరిజనులు మంకిడి కృష్ణయ్యతో పాటు 14మంది రైతులు పీఓకు మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండల పరిధిలోని గంటలకుంటలో విద్యుత్ సరఫరా లేక చాలా రోజులు అవుతుందని, వెంటనే గూడేనికి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు నంద, భద్రయ్య విన్నవించారు. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల స్రవంతి తన భర్త రాజ్‌కుమార్ మరణించారని, అతడి పేరుపై ఉన్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాను తన పేరు మీదకు మార్చాలని పీఓకు విన్నవించారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఐటీడీఏ క్వార్టర్స్‌లో వాటర్ మెన్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం మేడిపల్లికి చెందిన ఓ గిరిజనుడు జగ్గన్నపేట ఆశ్రమ జూనియర్ కళాశాలలో పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. మంగపేట మండలం పొద్మూరు, అబ్బాయిగూడెం, మొర్రవానిగూడెంలో పీసా గ్రామ సభలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. పీఎంఏఏజీవై 2 బిల్స్, ఇతర బిల్లుల ఇప్పించాలని భూపాలపల్లి, చిన్నబోయినపల్లి కాంట్రాక్టర్లు విన్నవించారు. ములుగు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి యూనిఫాం వర్క్స్ ఆర్డర్ ఇవ్వాలని పలువురు గిరిజనులు విన్నవించారు. గోవిందరావుపేట బంధాల పోచాపురం గ్రామ పంచాయతీలో బోర్లు వేసుకోవడానికి అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించాలని గిరిజనులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, డీటీ అనిల్, ఏఓ కృష్ణారావు, మేనేజర్ శ్రీనివాస్, ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లు నిర్మించాలి..
కన్నాయిగూడెంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, మిషన్ భగీరథ, తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
– పొడెం బాబు, కన్నాయిగూడెం,
తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఐటీడీఏలో వచ్చిన వినతులు ఇలా..