
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
సోమవారం నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రోజూవారీ షెడ్యూల్లో భాగంగా పట్టణాలతో పాటు గ్రామాల్లో వంట గదులు, స్కూల్స్, కాంప్లెక్స్, హాస్పిటల్స్, గోదాములు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో తీసుకునే జాగ్రత్తలను సూచిస్తాం. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిస్తే సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వస్తాం.
– స్టేషన్ ఫైర్ ఆఫీసర్, కుమారస్వామి
●