రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది | - | Sakshi
Sakshi News home page

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Apr 9 2025 1:48 AM | Updated on Apr 9 2025 1:48 AM

రైతుల

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

మంత్రి సీతక్క

ములుగు: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో అంచనా వేసి అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అధికారులతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.

ఆర్‌ఎంపీపై కేసు నమోదు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో లైసెన్స్‌ లేకుండా మందులు విక్రయిస్తున్న ఆర్‌ఎంపీ మనోజ్‌పై కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పావని తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మేడారంలో కొంత కాలంగా మనోజ్‌ అనే ఆర్‌ఎంపీ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అనుమతి లేకుండా అక్రమంగా మందులు నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు స్థానికుల సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించి తనిఖీ చేసి, పీజిషియన్‌ శాంపిల్‌తోపాటు పలు రకాల మందులు లభించినట్లు గుర్తించినట్లు తెలిపారు. మందులను సీజ్‌ చేసి ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పావని తెలిపారు. అనుమతులు లేకుండా ఆర్‌ఎంపీలు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

గొత్తికోయ గూడెంలో

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

వెంకటాపురం(ఎం): మండలంలోని ఊట్లతోగు గొత్తికోయ గూడెన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ సునీత, ఏఈ ప్రవీణ్‌ మంగళవారం సందర్శించారు. మంత్రి సీతక్క ఆదేశానుసారం గూడెన్ని సందర్శించి గూడెంలో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. గొత్తికోయగూడెల్లో తాగునీటి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

కోనంపేట సమీపంలో

పులి సంచారం

కాటారం: మహాముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పులి అడుగులను పోలిన గుర్తులను గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో పులి అడవిలో ఉందనే వార్త గ్రామం మొత్తం చుట్టేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీ లించారు. అవి పులి అడుగులు కావని పులిని పోలిన హైనా వంటి అటవీ జంతువు పాదముద్రలు అని రేంజ్‌ అధికారి ఉష తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.

గ్యాస్‌ సిలిండర్‌

ధరలను తగ్గించాలి

భూపాలపల్లి అర్బన్‌: పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్‌ గ్యాస్‌ ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని మండిపడ్డా రు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రోజువారి కూలీ వేతనం పెరగక అనేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్‌ తెలిపా రు. శ్రీకాంత్‌, నేరెళ్ల జోసెఫ్‌, అస్లాం, హరీశ్‌, శివకృష్ణ, శేఖర్‌, లావణ్య, వనిత పాల్గొన్నారు.

రైతులను ప్రభుత్వం  ఆదుకుంటుంది 
1
1/2

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

రైతులను ప్రభుత్వం  ఆదుకుంటుంది 
2
2/2

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement