నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
గోవిందరావుపేట: వడగండ్లవానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతుల పంట పొలాలు, ఇళ్లను ఆ పార్టీ మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో నాగజ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కూలిపోయిన ఇళ్లకు రూ.5 లక్షల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, మానవతా ధృక్పథంతో రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, పూర్ణ చందర్, మల్లేష్ గౌడ్, ఐలయ్య, తిరుపతమ్మ, మల్లమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ నాగజ్యోతి


