రెండవ రోజు పాదయాత్ర
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు.


