రజతోత్సవ మహాసభకు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవ మహాసభకు తరలిరావాలి

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

ములుగు: ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, రజతోత్సవసభ ములుగు ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశానికి పెద్ది ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని 10 మండలాల్లో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కంకణబద్ధులు కావాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయి నుంచి ఎండగట్టే ప్రయత్నం చేయాలని చెప్పారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ములుగు గడ్డపై గులాబీజెండా ఎగరడం ఖాయమని చెప్పారు. రైతులకు బోనస్‌ పేరుతో మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్‌, నాయకులు భూక్య జంపన్న, గండ్రకోట సుధీర్‌, విజయ్‌రాంనాయక్‌, పాలెపు శ్రీనివాస్‌, కోగిల మహేష్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement