
ప్రజలకు పాలనా సౌలభ్యం కల్పించాలి
పోరాటానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడం సంతోషకరం. నూతన మండల కేంద్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని సకాలంలో భవనాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం. ములుగు జిల్లా కేంద్రం నుంచి పాలనను కొనసాగించడం ఇబ్బందిగా ఉంది. ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మండల పరిషత్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. – గోల్కొండ రాజు, మండల సాధన సమితి అధ్యక్షుడు
●