వెంకటాపురం(కె): ఆత్మహత్య చేసుకున్న మొక్క జొన్న రైతు మధుకృష్ణ కుటుంబానికి పరిహారం చెల్లించాలని శుక్రవారం చిరుతపల్లి గ్రామస్తులు, గిరిజన సంఘాలు, సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని చిరుతపల్లి గ్రామ సమీపంలోని ఆర్‌ఆండ్‌బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బాధిత రైతు కుటుంబానికి పరిహారం ఇచ్చి కుటంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలి చ్చిన ఆర్గనైజర్లపై కేసులు పెట్టి చర్యలు తీసుకో వాలన్నారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి పరిహారం చెల్లించేలా చర్యలు చే పడతామని తెలిపారు. కార్యక్రమంలో గ్యానం వా సు, చిట్టెం ఆదినారాయణ, నర్సింహామూర్తి, పూ నెం సాయి, కుమ్మరి శ్రీను, ఉయిక శంకర్ ఉన్నారు.