ములుగు రూరల్: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని జగ్గన్నపేటలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, స్పెషల్ ఆఫీసర్ రహీం, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.